టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై గుంటూరు జిల్లా మాచర్లలో దాడి జరగడంపై పార్టీ వర్గాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమ తదితర సీనియర్ నేతలు ఘటనను తీవ్రస్థాయిలో ఖండించారు. తాజాగా, ఈ దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్త ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టీడీపీ నేతలపై దాడి చేసిన వ్యక్తి ఆ ఫొటోల్లో సీఎం జగన్, మంత్రులు అనిల్, మేకతోటి సుచరిత, కొడాలి నాని తదితరులతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు చూడొచ్చు. పాదయాత్ర సమయంలోనూ ఆ వ్యక్తి జగన్ వెంటే చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ… మాచర్లలో బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై ఈ వైసీపీ గూండానే దాడి చేశాడని వెల్లడించింది. ఉమ, వెంకన్నలపై హత్యాయత్నం చేశాడని ఆరోపించింది.
మాచర్ల లో బొండా ఉమా, బుద్ధా వెంకన్న పై ఈ వైసీపీ గూండానే హత్యాయత్నం చేసాడు(2/2)@CEOAndhra#APLocalBodyElections#ElectionCodeViolation#APDeservesBetter#YCPCodeViolation pic.twitter.com/ADGAdA0DvO
— Telugu Desam Party (@JaiTDP) March 11, 2020