భారత జట్టు తన తొలి వన్డే పోటీని 1974 జులై 13న ఇంగ్లండ్ తో ఆడింది. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఆనాటి మ్యాచ్ లో భారత్ ఓడింది. భారత్ ఇప్పటివరకు 999 వన్డేలు ఆడి 518 విజయాలు నమోదు చేసింది. 431 మ్యాచ్ ల్లో ఓటమి పాలవగా, 41 మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి. 9 మ్యాచ్ లు టై అయ్యాయి. భారత జట్టు తన 500వ వన్డేని 2002లో ఆడింది. రెండు దశాబ్దాల అనంతరం ఇప్పుడు 1000వ వన్డేలో ఆడనుంది.