తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఏకంగా 56 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో 21 మంది కలెక్టర్లు ఉండడం గమనార్హం. అలాగే, పలువురు జూనియర్లకు కూడా పోస్టింగులు ఇచ్చింది. అంతేకాదు, త్వరలో మరికొందరు అధికారులను కూడా ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. అబ్దుల్ అజీజ్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమించగా, కామారెడ్డి జిల్లాకు శరత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంవీరెడ్డి, ఆదిలాబాద్‌కు ఎ.శ్రీదేవసేన, నారాయణపేటకు హరిచందన దాసరి, హైదరాబాద్‌కు శ్వేత మహంతి, నల్గొండకు పాటిల్ ప్రశాంత్ జీవన్, వరంగల్ అర్బన్‌కు రాజీవ్‌గాంధీ హన్మంతులను నియమించింది. మహబూబ్ నగర్‌కు ఎస్.వెంకటరావు, సూర్యాపేటకు టి.వినయ్ కృష్ణ, మేడ్చల్‌కు వి.వెంకటేశ్వర్లు, ఆసిఫాబాద్‌కు సందీప్ కుమార్ ఝా, పెద్దపల్లికి ఎస్.పట్నాయక్, నిర్మల్‌కు ముషారఫ్ అలీ, ములుగుకు ఎస్‌కే ఆదిత్య, మహబూబాబాద్‌కు వీపీ గౌతమ్, జగిత్యాలకు జి.రవి, జనగామకు కె.నిఖిల, వనపర్తికి ఎస్‌కేవై బాషా, వికారాబాద్‌కు పసుమి బసూ, జోగులాంబ గద్వాలకు శ్రుతి ఓఝాలను కలెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరికొందరు సీనియర్లకు శాఖల మార్పులతోపాటు, అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.