కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని కౌండిన్య వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరి సురేష్, గన్నేరువరం ఒకటో వార్డు సభ్యులు బుర్ర జనార్దన్ గౌడ్,బుర్ర శ్రీనివాస్, మెరుగు సంతోష్, యువజన సంఘాల మండల అధ్యక్షుడు గుడాల సురేష్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు తోట ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు