contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహిళా కార్పొరేటర్ భర్త చేతిలో ఏకే-47 ….వైరల్ అవుతున్న ఫొటో

హైదరాబాదులోని రాజేంద్రనగర్ కార్పొరేటర్ కోరని శ్రీలత భర్త మహాత్మ చేతిలో ఏకే-47 తుపాకీ ఉండటం కలకలం రేపుతోంది. ఏకే-47 తుపాకీని ఎక్కుపెట్టి ఆయన దిగిన ఫొటో వాట్సాప్ లో వైరల్ అవుతోంది. ఈ తుపాకీ ఆయనకు ఎవరిచ్చారనే దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై మమాత్మా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం పోలీసు అధికారుల శిక్షణ శిబిరానికి వెళ్లానని… రాజేంద్రనగర్ సర్కిల్ లోని మానస హిల్స్ వద్ద బందోబస్తులో ఉన్న ఓ పోలీసు వద్ద నుంచి తుపాకీ తీసుకుని ఫొటో దిగానని ఆయన చెప్పారు. దాన్ని వాట్సాప్ స్టేటస్ లో పెట్టి, ఆ తర్వాత డిలీట్ చేశానని తెలిపారు. ఎవరో కావాలనే ఈ ఫొటోను వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :