గత కొన్ని సంవత్సరాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న పారామిలటరీ ( BSF,SSB ,ITBP, CRPF, CISF AR దళాల లో పని చేస్తునటువంటి సైనికులందరూ దేశ సేవే కాకుండా సామాజిక సేవలో కుడా ముందున్నాం అంటున్నారు. ఇప్పటివరకు నిత్యవసర వస్తువులు మాస్కులు శానిటైజర్ పంపిణీ అనాధలకు వృద్ధులకు వారి కుటుంబాలకు సహాయం సైనికుల లో ఉన్న సమస్యలకు సహకారం వస్తున్న జిల్లా పారామిలటరీ సైనికులు. దేశంలో ముఖ్యంగా కరోనా మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న ఉగ్రరూపం దాల్చడంతో ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం లో వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం పాటించాలని సూచిస్తూ శ్రీకాకుళం పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుమీదుగా కరపత్రాన్ని విడుదల చేశారు ఈ పత్రాలను జిల్లాలోని 38 మండలాలలో అందజేసి మండలాల లోనే గ్రామాలలోని సార్వజన ప్రదేశాలలో అతికించే విధంగా రూపొందించారు. ఈ కార్యక్రమంలో అట్లా సుమన్, కోటి లక్ష్మణ్ రావు, కేతుబారికి రామారావు, సీపాన లక్ష్మణరావు, భాస్కర్ గాంధీ, డోలా నాగరాజు, గన్గిట్ల శ్రీనివాసరావు, కె వి మూర్తి, రామారావు, తోటి అసోసియేషన్ సైనికులు పాల్గొన్నారు.