contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

మేళ్ళవాగులో అడ్డగోలుగ ప్రభుత్వ భూములు కబ్జా .. కొమ్ము కాస్తున్న ప్రభుత్వం అధికారులు

  • కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులు
  • అధికారుల హస్తం ఉందంటున్న స్థానికులు
  • పట్టించుకోని బొల్లాపల్లి ఎమ్మార్వో
  • ఆర్ & బి డీఈ కి చెప్పమంటున్న ఫారెస్ట్ అధికారి
  • నాకు ఎటువంటి సమాచారం లేదంటున్న బొల్లాపల్లి ఎమ్మార్వో
  • స్థానిక ఎంపిటిసి హస్తమున్నట్టు సమాచారం

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు గ్రామా శివారులో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. మేళ్ళవాగు మెయిన్ రోడ్డు పక్కన అటవీశాఖ బంగ్లా ఉండేది. అటవీశాఖ బంగ్లా ని అనుకుని ఆర్ & బి భూమి ఉంది. ఆ భూమిలో దర్జాగా అక్రమ నిర్మాణం సాగిస్తున్నారు. కానీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ వారు మాత్రం ఆ భూమి మాది కాదని, ఆర్ & బి వారికి తెలియజేశామని, ఆర్ & బి డీఈ బొల్లాపల్లి ఎమ్మార్వోకి తెలిపితే నేటికీ చర్యలు తీసుకోవటం లో జాప్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయం పై బొల్లాపల్లి ఎమ్మార్వో ని అడిగితె నాకు ఎటువంటి లెటర్ రాలేదని బుకాయించాడు. ఇకనైనా అధికారులు స్పందించి దర్జాగా కబ్జా చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :