జనవరి 7 న సాయంత్రం 5:30 గంటలకు ఇరాక్‌లోని యుఎస్ మిలిటరీ, సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను ఇరాన్ నుండి ప్రయోగించారని, అల్-అస్సాద్, ఇర్బిల్.. ఇరాకీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టమైంది. మేము ప్రారంభ యుద్ధ నష్టం అంచనాపై పని చేస్తున్నాము’ అని పెంటగాన్ తెలిపింది. యు.ఎస్ దళాలు ఉన్న రెండు ఇరాకీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను పేల్చింది. పెంటగాన్ ఈ దాడిని ధృవీకరించింది. కాని ఏదైనా దళాలు చంపబడ్డాయా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరానియన్ జనరల్ ఖాసేం సోలైమాని హత్యకు మొదటి ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తాడు అన్నవిషయంపై యుద్దమేఘాలు కమ్ముకునే అవకాాశం ఉంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference