భారత రత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ 63 వ వర్దంతి సందర్భంగా గన్నేరువరం
మండలంలోని హన్మజిపల్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి పుష్పాభిషేకం చేసి క్యాండీల్ దీపాలు వెలిగించి ఘనంగా నివాళి అర్పించిన దళిత్ శక్తి ప్రోగ్రాం( DSP )-భారత రాజ్యాంగ రక్షణ దళం.
ఈ సంధర్భంగా DSP జిల్లా కో – కన్వీనర్ మహేందర్ మహారాజ్ జెరిపోతుల మాట్లాడుతూ “DSP ఉద్యమ అధినాయకుడు డా.విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగ అన్ని జిల్లా మరియు మండల కేంద్రాల్లో తండ్రి అంబేడ్కర్ 63 వర్దంతి సందర్భంగా నివాళి కార్యక్రమాలు జరుగుతునాయని. తన రక్త మాంసాలు కరిగించి భారత రాజ్యాంగ రచన ద్వార 90% ప్రజలను బానిస బ్రతుకులు, అణిచివేతలు, అవమానాలు, అస్పృశ్యతల నుండి విముక్తి కల్పించిన తండ్రి అంబేడ్కర్ ఉద్యమాన్ని కొనసాగించడమె మా DSP పనివిధానం అని. అంబేడ్కర్ రాజ్యాంగానికి ముందు రాజుల కడుపున రాజులు, బానిసల కడుపున బానిసలే పుట్టారు కానీ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత బానిసల కడుపున కూడా భారత రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, ఐఎఎస్, ఐపిఎస్ లు పుట్టారని. బలహీనుల బ్రతుకు ప్రదాత బాబాసాహేబ్ అంబేడ్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగ రచనకు నిర్విరామంగ శ్రమించి భారతీయ ఎస్ సి, ఎస్టి, బి సి, ఇ బి సి ప్రజలకు ప్రాణం పోసి డిసెంబర్ 6, 1956 న తన ప్రాణాలు వదిలేసి అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అయి, అణగారిన వర్గాల ఆత్మ జ్ణానమై, మండుతున్న సూర్య గోళం లా నిత్యం ప్రకాశిస్తున్నాడని. శారీరక వారసత్వం ఆయన మరణంతో దూరమైనా ఆయన జ్ణానవారసత్వాన్ని అనునిత్యం అనుసరిస్తూ, ఆచరిస్తు ఆయన ఆలోచన విధానాన్ని, సిద్దాంతాలను, ఆశయాలను DSP కొన సాగిస్తుందని. అదే ఆ మహనీయుడికి అసలైన నివాళి అని” వివరనాత్మకంగా తెలియజేసారు.
కార్యక్రమంలో మండల కో కన్వీనర్ సుధాకర్ మహారాజ్ స్థానిక అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మహారాజ్. నాగరాజు మహారాజ్ .మహేష్ మహారాజ్. ప్రభాకర్ మహారాజ్ .అశోక్ మహారాజ్ .దేవదాస్ మహారాజ్. శ్రీకాంత్ మహారాజ్ . అనిల్ మహారాజ్. తదితర DSP నాయకులు పాల్గొన్నారు.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???