కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచిర్యాల లో డిసెంబర్ 18 19 తేదీల్లో జరగనున్న ఆరో రాష్ట్ర సబ్ జూనియర్ బాల బాలికల అథ్లెటిక్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు ఈ నెల 5న అంబేద్కర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి ట్రిక్స్ పోటీలో మహేందర్, తేజ, అఖిల, అమూల్య లు ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హనుమాజి పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి లింగాల భవాని గుండ్లపల్లి స్ఫర్కిల్ స్కూలుకు చెందిన అమూల్య లో ప్రతిభ కనబర్చి మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు ఈ సందర్భంగా సోమవారం వీరిని ప్రధాన ఉపాధ్యాయుడు ఆంజనేయులు సర్పంచ్ అట్టికం శారద,ఎంపీటీసీ అట్టికం రాజేశం, కరస్పాండెంట్ ఆంజనేయులు ఎస్ఎంసి చైర్మన్ బండి తిరుపతి సభ్యులు ఉపాధ్యాయులు పాఠశాలలో వారిని సన్మానించారు.