కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి ప్రభుత్వ పాఠశాలలో 65వ రాష్ట్రస్థాయి పాఠశాలల ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ మల్లారెడ్డి హాజరై క్రీడాపోటీలు పతాక ఆవిష్కరించారు అదేవిధంగా మండల జడ్పిటిసి రవీందర్ రెడ్డి మండల రెవెన్యూ అధికారి కె రమేష్ ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, గ్రామ సర్పంచ్ అట్టికం శారద శ్రీనివాస్ ఉప సర్పంచ్ గీకురూ లత ఆంజనేయులు ,పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ బండి తిరుపతి మండల ఎంఈఓ మధుసూదనా చారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి కనుక సమ్మయ్య జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి సమ్మిరెడ్డి జిల్లా అసోసియేషన్ సెక్రెటరీ కొమ్రోజు శ్రీనివాస్,కొమ్మరాజు, కృష్ణ,జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సంపత్ రావు, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు ఈ క్రీడా పోటీలకు పాత పది ఉమ్మడి జిల్లాల గాను తొమ్మిది జిల్లాల నుండి సుమారు 120 మంది క్రీడాకారులు 50 మంది టెక్నికల్ అఫీషియల్ పాల్గొన్నారు ఈరోజు వీరికి ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీలు జరిగాయి రేపు రిసీవ్ మరియు కాంపౌండ్ రౌండ్ అంశాలు పోటీలు జరుగుతాయని అసోసియేషన్ సభ్యులు తెలిపారు