నపర్తి జిల్లా :నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో.. కన్న కొడుకు ముందు తండ్రిని పోలీసులు లాఠీలతో బాదుతున్న దృశ్యం ఇప్పుడు సోషియల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. మా డ్యాడీని కొట్టొద్దు అంకుల్ అని గొంతు చించుకునేలా అరిచిన ఆ పిల్లాడి ఆక్రందనని పట్టించుకోకుండా హృదయవిదారకంగా చితకబాదారు ఖాకీరాయుళ్ళు. తన తల్లినీ కూడా దూషించే సంభాషణలు ఆ పిల్లాడిపై ఏ విధమైన ప్రభావం చూపుతుందోనన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పదప్రయోగాలు చేశారు ఆ పోలీసులు. ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డ అందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలని సర్వత్రా విమర్షలు వినిపిస్తున్నాయి.