contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లాక్‌డౌన్‌ కర్ఫ్యూ – రొడ్డు పై ఆపిన పొలీసు చెయ్యి నరికిన వైనం – విడియో చూడండి

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు శ్రమిస్తోన్న పోలీసులపై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులపై కొందరు  దాడి చేశారు.ఈ దాడిలో ఓ పోలీసు చేతిని నరికేసి, మరో ఇద్దరి పోలీసు అధికారులను తీవ్రంగా గాయపర్చారని పోలీసులు ప్రకటించారు. సిక్కు వర్గానికి చెందిన నిహంగ్స్‌ ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు. వారంతా వాహనంలో కూరగాయల మార్కెట్‌ మీదుగా వెళ్తున్న సమయంలో పోలీసులు వారిని ఆపి ప్రశ్నించారు. కర్ఫ్యూ పాసులు చూపించాలని వారిని పోలీసులు కోరారు.దీంతో వారు తమ వాహనంతో గేటును, బారికేడ్లను ఢీ కొట్టారు. అనంతరం ఆ బృందంలోని సభ్యులు పోలీసులపై దాడి చేశారు. అసిస్టెంట్‌ సబ్ ఇన్‌స్పెక్టర్‌ చేతిని కత్తితో నరికేశారని పటియాలా పోలీసులు మీడియాకు వివరించారు. మరో ఇద్దరు పటియాలా పోలీసుల చేతులపై గాయాలయ్యాయని తెలిపారు.గాయాలపాలైన పోలీసులకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోందని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.కాగా, పంజాబ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 151 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగానూ పొడిగించాలని ఆయన నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :