contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విజయవాడ లో ఉద్రిక్తత , మరో మారు 144 సెక్షన్ ….

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ మహిళలు..రైతులు ఈ రోజు అమరావతి గ్రామాల నుండి విజయవాడ వరకు ర్యాలీ చేయాలని నిర్ణయించారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యాన్ని సమర్పిం చనున్నారు. అయితే, దీనికి గుంటూరు రూరల్ తో పాటుగా విజయవాడ నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 144, యాక్ట్ 30 అమల్లో ఉండటంతో ఎవరికీ నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసారు. అయినా..రాజధాని ప్రాంత మహిళలు..రైతులు, రైతు కూలీలు మాత్రం తాము కార్యక్రమం నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. దీంతో..అటు అమరావతి గ్రామాల పరిధిలోనూ..ఇటు బెజవాడ పరిధిలోనూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.అమరావతికి మద్దతుగా సాగుతున్న ఉద్యమంలో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని గ్రామాల నుంచి దుర్గగుడికి పాదయాత్రగా వెళ్లనున్న రైతులు, మహిళలు కనకదుర్గమ్మకు సారె, నైవేద్యాన్ని సమర్పించనున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ పాదయాత్ర చేసి తీరుతామని రైతులు, రైతు కూలీలు స్పష్టం చేశారు. దీంతో..అటు విజయవాడ..ఇటు అమరావ తి గ్రామాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఉదయం నుండే రెండు ప్రాంతాల్లోనూ జేఏసీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇక, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగే సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఇదే సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాటాలకు ధీటుగా అధికార వైసీపీ సైతం ర్యాలీలకు సిద్దం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు ఈ రోజు నిర్వహించాలని నిర్ణయించింది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :