కరీంనగర్ జిల్లా: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా & నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు వద్ద గల ఎస్ఇ కార్యాలయం ముందు తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యార్జీలు మరియు బ్లాక్ బెలున్లతో నిరసన చేపట్టడం జరిగింది. అనంతరం SE ని కలిసి లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల నుండి రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు మినహాయింపు ఇవ్వాలని, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వలె అన్ని బిల్లింగ్ టేలిస్కోపిక్ పద్ధతిలో చేయాలని, లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల నుండి అన్ని చిన్న వ్యాపారాలకు మినహాయింపు ఉండాలని, విద్యుత్ బిల్లులు తగ్గించాలని, డిమాండ్ చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధులు దాసరి భూమయ్య,ఒంటెల రత్నాకర్, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి తాజద్ధిన్ యూత్ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షుడు నాగి శేఖర్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మల్యాల సుజిత్ కుమార్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ ఎన్ ఎస్ యూఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు