కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని 33/11 KV విద్యుత్ ఉపకేంద్రం (సబ్ స్టేషన్)లో బుధవారం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ కరీంనగర్ రూరల్ డివిజన్ అలుగునూర్ సబ్ డివిజన్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి టెక్నికల్ చైర్ పర్సన్ ఈశ్వరయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు విద్యుత్ కు సంబంధించిన వివిధ సమస్యలపై రైతులు దరఖాస్తులు సమర్పించారు అనంతరం చైర్ పర్సన్ ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విద్యుత్ వినియోగాన్ని మరింత పటిష్టం చేస్తూ 24 గంటల కరెంటు ను అందిస్తుందని అన్నారు ప్రభుత్వం అందిస్తున్న కరెంటును సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని రైతులకు సూచించారు పారిశ్రామికంగా నివాసాల్లో కేటగిరిల ఆధారంగా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ మేరకు పలువురు రైతులు ఇనుప స్తంభాలు తొలగించడం లూజు వైర్లు రెగ్యులర్ సమస్యలు లు పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు గ్రామాల్లో నెలకొన్న కరెంటు సమస్యలు విద్యుత్ సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని అధికారులను ఆదేశించారు రైతులు వినియోగదారుల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు తెలంగాణ భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి జోగినిపల్లి సంపత్ రావు రైతుల మేరలో రైతుల సదస్సుకు గైర్హాజరయ్యారని తెలిపారు మండలంలో సిబ్బందితో పాటు అధికారులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కోరారు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు ఈ సమావేశంలో ఫైనాన్స్ మెంబర్ చరణ్ దాస్, ఇండిపెండెంట్ మెంబర్ గణపతి రెడ్డి, ఏడి కిరణ్, ఏఈ శ్రీనివాస్, రైతులు గొల్లపల్లి రవి,న్యాత సుధాకర్, బొడ్డు సునీల్, రామంచ స్వామి, లైన్ మెన్ రాజు, తదితరులు పాల్గొన్నారు