కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ జిల్లా మాదక పదార్థాల నియంత్రణ కమిటీ చైర్మన్ విబి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనరేట్ కేంద్రంలో దగ్ధం చేశారు. కమిషనరేట్ లోని కరీంనగర్ వన్ టౌన్, త్రీ టౌన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధి లో పట్టుకున్న 10 కేసుల్లో 46.580 కిలోల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు ఈ గంజాయిని దగ్ధం చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ జిల్లా మాదక పదార్థాల నియంత్రణ కమిటీ చైర్మన్ విబి కమలాసన్ రెడ్డి తో పాటు అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్, కరీంనగర్ టౌన్ ఏసీపీ పి అశోక్ , సిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆర్ఐ మల్లేశం, సంబంధిత పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు