కన్న తండ్రే కాలయముడయ్యాడు.ఎదుగుతున్న కూతురుకు పెట్టాల్సిన ఖర్చులకు జడిసి కర్కశంగా ఊపిరి తీసాడు.క్రూరంగా గొంతులో కత్తిదించి కట్టుకథలు అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించాడు.కాకమ్మ కథలు కంచికి పంపిన కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి నిందితుడి నోటి నుండి నిజాన్ని కక్కించారు.హంతకుణ్ణి అదుపులోకి తీసుకున్నాడు. కరీంనగర్ పోలీస్లు ఊహించినట్టే జరిగింది.
కరీంనగర్ లోని విద్యానగర్ లో ఫిబ్రవరి 10 న జరిగిన రాధికా హత్య కేసులో కన్న తండ్రే హంతకుడని మొదటి గంటకే కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి నేతృత్వం లోని పోలీస్ లు కనిపెట్టగలిగారు.అయితే కూతురు చనిపోయిందని రోదిస్తున్నట్లు నటిస్తూన్నా తండ్రిని రాధిక అంత్యక్రియలవరకు స్వేచ్ఛగా వదిలిపెట్టారు.రాధిక తండ్రిని విచారించాలని మొదట పోలీస్ లు ప్రయత్నినప్పటికీ కూతురు చనిపోయిన బాధతో పాటు కర్మ కాండలు ఉన్నందున అయన ను విచారణకు పిలిస్తే జరిగే ఇబ్బందులను,ప్రజా సంఘాలనుండి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో
పెట్టుకుని బయటి అనుమానితులపై ద్రుష్టి సారిస్తూనే ఓ కన్ను తండ్రిపై పెట్టి ఉంచారు.ముఖ్యం గా ఈ హత్య దొంగ తననికి ముడిపెట్టడం,ఇంట్లో రక్తం మరకలు కడగడం వంటి సంఘటనలో రాధికా తండ్రి నోరు తెరిస్తే తప్ప హంతకుడు దొరికే అవకాశం లేదని భావించిన పోలీసులు రాధికా తండ్రి ముత్తా కొమురయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడం తో తండ్రి తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.పోలియోతో బాదపడుతున్న రాధికకు ఇప్పటికే తానూ ఎంతో ఖర్చు చేసి బాగుచేయించానని,మల్లి పెళ్ళికి కూడా లక్షలాది రూపాయలు ఖర్చుఅవుతాయని తెలిసి భయంతో రాధిక ముఖానికి బేడ్ షీట్ ను అదిమి ఊపిరాగేలాచూసానని తండ్రి ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత తనపై హత్యానేరం రాకుండా ఇంట్లో ఉన్న కత్తి తో గొంతుకోసి చంపి,ఆధారాలు దొరకకుండా అక్కడ రక్తపు మరకలను శుభ్రం చేసానని , ఎవరో దొంగతనం చేసినట్లు కథ అల్లి
బీరువాలోని మూడు తులాల బంగారాన్ని, నగదును మాయం చేసి బీరువాను మూసేసి, దానికి అడ్డుగా మంచం పెట్టి వెళ్లానని కొమురయ్య పోలీసులకు తెలిపినట్లు తెలుస్తుంది.మొత్తానికి కరీంనగర్ మిస్టరీ వీడడం తో పోలీసులు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తుంది.కాగా కన్న తండ్రే కాసులకు కక్కుర్తి పడి కన్న కూతురును హత్య చేయడం ప్రజలని కలిచివేసింది.