సాయి బాబా జన్మస్థలంగా చెబుతున్న పత్రి పట్టణ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయించారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. ఇదే కొత్త వివాదానికి తెర లేపింది. పత్రి అభివృద్ధి చెందితే… షిర్డి ప్రాశస్థ్యం తగ్గిపోతుందనే చుట్టూ గల 25 గ్రామాలు ఆందోళనకు దిగుతున్నాయన్నది కొందరి వాదన. ఇంకోవైపు… సాయినాథుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దని భక్తులు కోరుతున్నారు. షిరిడీ అంటేనే సాయినాథుడు కొలువైన ప్రదేశమని.. అదే తమనమ్మకని తేల్చి చెబుతున్నారు. ఇక్కడే బాబా సమాధి సైతం ఉందని.. ఆలయం వివాదానికి ముగింపు పలకాలని సూచిస్తున్నారు. మరికొందరు భక్తులు.. షిరిడీలానే పత్రిలోనూ ఆలయం నిర్మిస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.
షిరిడీ ఆలయం వివాదంలో చిక్కుకుంది. సాయిబాబా జన్మస్థలంగా చెబుతున్న పత్రి అభివృద్ధి సాధిస్తే… షిర్డీకి ప్రాభవం తగ్గిపోతుందన్నది కొందరి వాదన. ఈ క్రమంలో 25 గ్రామాల ప్రజలతో పాటు బాబా భక్తులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. షిరిడీతో పాటూ చుట్టూ గల 25 గ్రామాల్లో మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని నిర్ణయించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం ఉద్ధవ్ థాక్రే దిగి వచ్చే వరకు నిరవధిక బంద్ పాటించాలన్నది షిరిషీ చుట్టూ గల గ్రామాలు నిర్ణయించాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference