సికింద్రాబాద్‌లో తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. వారాసిగూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వారికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ లోని వారాసిగూడలోని ఓ ఇంట్లో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి దంపతులతోపాటు వారి నలుగురు కుమార్తెలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారాసిగూడలో నివాసం ఉంటున్న గౌస్, షబానా దంపతుల ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వారికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లంతా ఇంట్లో పడుకున్న సమయంలో తెల్లవారుజామున ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆందోళనకు గురయ్యారు.
గ్యాస్ పేలుడు ధాటికి వారి ఇంటి పైకప్పు సహా … ఇళ్లంతా పూర్తిగా ధ్వంసమైంది. అంతే కాదు వారు కూడా తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. క్లూస్ టీంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తేయాల్సి ఉంది