contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సోలో గ మరోసారి అదృష్టం పరిష్కించుకుంటా అంటున్న అల్లరి హీరో

హిట్స్‌తో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా  అల్లరి నరేష్‌ వరుస విజయాలతో ఆకట్టుకున్నాడు. జెట్‌ స్పీడుతో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ యంగ్ హీరో తరువాత ఒక్కసారిగా కెరీర్‌లో వెనకపడ్డాడు. మూస కథలు రొటీన్‌ కామెడీ సినిమాలు ఆడియన్స్‌కు బోర్‌ కొట్టడంతో నరేష్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. సుడిగాడు సినిమా తరువాత ఈ యంగ్ హీరోకు సాలిడ్‌ హిట్ ఒక్కటి కూడా దక్కలేదు. 
ఇటీవల మహర్షి సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా మరో డిఫరెంట్‌ మూవీకి రెడీ అవుతున్నాడు అల్లరి నరేష్‌. అయితే ఈ సినిమాలో పూర్తిగా యాక్షన్‌ రోల్‌లో కనిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమా ప్రారంభోత్సవ ఆహ్వానం అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. 
ప్రస్తుతం బంగారు బుల్లోడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నరేష్‌ ఈ సినిమా తరువాత విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేయనున్నాడు. సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానున్న ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సతీష్‌ వేగేశ్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్‌ పాకల సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడించనున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :