కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి కుర్మా వాడ కు చెందిన చిలుకూరి మల్లేశం అనే వ్యక్తి కొత్తపల్లి-కరీంనగర్ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా విద్యుత్ స్తంభం ను ఢీకొట్టడంతో తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి అటుగా వెళుతున్న కొత్తపల్లి ఎస్సై ఎల్లయ్య గౌడ్ చూసి వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా వారు రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కొత్తపల్లి ఎస్సై ఎల్లయ్య గౌడ్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు