కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని యాస్వాడ గ్రామంలో హరితహారం లో భాగంగా 10 వేల మొక్కలు గ్రామానికి వచ్చాయి గ్రామ సర్పంచ్ జక్కన పల్లి మధుకర్ రెండు మూడు వందల మొక్కలు మాత్రమే పెట్టారని మిగతా మొక్కల్ని ఊరి చివర్లో పడేశారని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గువ్వల సత్యం అన్నారు ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి గ్రామాన్ని పచ్చదనాన్ని చేయాల్సింది పోయి మొక్కల్ని ఊరి చివర లో పడేసి చంపడానికి ప్రయత్నం చేసిన సర్పంచ్ పై కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు గువ్వల సత్యం తెలిపారు