దేశంలో ఓవైపు కరోనా విజృంభిస్తున్న సమయంలోనే బీఎస్4 డిస్కౌంట్ల పండుగ ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ నెలాఖరుతో బీఎస్4 రిజిస్ట్రేషన్లకు గడువు ముగుస్తుండడంతో వాహన తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులను ఆకర్షించేందుకు హ్యుందాయ్ కూడా బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది. వెర్నా, క్రెటా, టక్సన్, ఎక్సెంట్, శాంత్రో, గ్రాండ్ ఐ10, ఐ20 కార్ల మోడళ్లపై గరిష్టంగా రెండున్నర లక్షల రూపాయల వరకు బీఎస్4 ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఆయా మోడళ్లను అనుసరించి ఈ తగ్గింపు వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.