contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణాలో కొన‌సాగుతోన్న‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

 

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మూడు రోజుల క్రితం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రావడానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.  కౌంటింగ్ నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ ఎన్నిక‌ల్లో ప‌లు పార్టీల అభ్య‌ర్థులే కాకుండా స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గ‌ట్టి పోటీని ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప‌‌ల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం, స్వ‌తంత్ర అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న మ‌ధ్యే పోటీ నెల‌కొంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్, బీజేపీ అభ్య‌ర్థి రాంచంద‌ర్ రావు, టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవి మధ్య తీవ్ర పోటీ వుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :