contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు‌

సిద్దిపేట జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన హరీష్ రావు బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు‌.
మంత్రి రాక సందర్భంగా మండల, గ్రామ యువత, నాయకులు తన్నీరు పై పూల వర్షం కురిపించారు. మహిళా నేతలు మంగళ హారతులతో కుంకుమ తిలకం దిద్ది స్వాగతించగా, పూల మాలలతో బాణాసంచా కాల్చుతూ, డప్పుచప్పుళ్ళు, హోరెత్తించారు.

ఇంటర్ విద్యార్థుల్లారా.. ఇది పరీక్షల సమయం.! ఈ సమయాన్ని వృధా చేయవద్దు.!
పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండి.! టీవీలు, సినిమాలు చూడోద్దు.! ఈ ఏడాది ఇంటర్ లో‌వందకు వంద శాతం ఫలితాలుండాలని ఇంటర్ విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాన కొండూరు నియోజక వర్గంలోని బెజ్జంకి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆర్థిక మంత్రి హరీష్ రావు ఉదయం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి వివేకానందుడి విగ్రహాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.
అనంతరం బెజ్జంకి మండల‌కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అసలు పాస్ అవడం కోసం‌ చదవడమేంటనీ., ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలంటూ.. నిత్యం విజ్ఞానాన్ని పొందాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‌కళాశాలో‌ ఎకనమిక్స్, కామర్స్, సివిక్స్ సబ్జెక్టు లలో గత ఏడాది‌ తక్కువ మార్కులు వచ్చాయని, ఈ సారి ఈ‌సబ్జెక్టుల్లో విద్యార్థులు వందకు వంద శాతం పాస్ కావాలంటూ.. ఈ మేరకు మాట ఇవ్వాలని లెక్చరర్లు‌, విద్యార్థులు మాట ఇవ్వాలని. విద్యార్థులను తప్పనిసరిగా కాలేజీకి హాజరయ్యేలా పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇవాళ్టి నుండి మద్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నాం. రేపటి నుండి సాయింత్రం స్నాక్స్, టిఫిన్ ఏర్పాటు చేస్తామని, సాయింత్రం ఇక్కడే‌ విద్యార్థులను రెండు గంటల‌సేపు చదివించాలని సూచించారు. వందకు వంద శాతం పాసయితే వెంటనే‌ అదనపు గదులకు అవసరమైన రూ.40లక్షలు నిధులు ఇస్తానని. ఏదేమైనా జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో బెజ్జంకి కళాశాల తొలి‌ స్థానంలో నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.

అనంతరం నూతన మార్కెట్ కమిటీ భవనాన్ని ప్రారంభోత్సవం చేసి నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమలో ఏ.ఎం.సి ఛైర్మెన్ గా అక్కరవేని పోచయ్య ప్రమాణ స్వీకారం చేయగా డైరెక్టర్ గా మ్యాకాల శ్రీకాంత్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం తో హరీష్ రావు ఎమ్మెల్యే నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి భాద్యతలు అప్పగించినందుకు వారికి రుణపడి ఉంటానని రైతుల సంక్షేమంపై నిరారంతరం కష్టపడతానని నన్ను నమ్మిన నాయకుల పేరు నిలబెడతానని మార్కెట్ యార్డ్ కోసం అందరికి అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆర్థిక మాంద్యం, ఆర్థిక క్రమశిక్షణ పైనై చర్చజరిగిందని . వడ్డీ లేని రుణాలు దేశంలో కొన్ని జిల్లాలకే ఇస్తున్నారు. అన్ని జిల్లాలకు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లు..దేశానికి మహిళా‌ఆర్థిక మంత్రి గా ఉన్న మీరు దేశంలోని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్మలా‌సీతారామన్ ను కోరామని దేశంలోని అన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు ఇవ్వాలని .దేశ‌మహిళలు అందరూ ఆర్థిక స్వావలంబన సాధిస్తారని . సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ లకు ఇచ్చే మొత్తాన్ని మూడు లక్షల నుంచి ఐదు లక్షల కు పెంచాలని‌. అన్ని రాష్ట్రాల మంత్రులు కలిసి ప్రతిపాదించాలని నిర్మలా సీతారామన్ సూచించారు.త్వరలోనే కాళేశ్వర జలాలు బెజ్జంకి ని తకనున్నాయని అనంతగిరి ప్రాజెక్ట్ అతి త్వరలో పూర్తయి ప్రతి రైతు సంతోషంగా వర్షం కోసం ఎదురు చూడకుండా వ్యవసాయo చేయొచ్చని సస్యశామలం గా బెజ్జంకి మండలాని చూడొచ్చని పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి అందరూ సహకరించాలని మార్కెట్ కమిటీ ద్వారా మార్కెట్ యార్డ్ ద్వారా రైతులు తమ పంటలను అమ్మలని దళారులను నమ్మకుండా మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందాలని సూచించారు. మార్కెట్ యార్డ్ లో ఎలాంటి అవకతవకలు జరిగిన తమ దృష్టికి తీసుకురావాలని సత్వరమే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ , రాష్ట్ర నాయకులు శరత్ రావు, ఎంపిటిసిల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి కవిత, గన్నేరువరం జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపిపి నిర్మల, సర్పంచ్ ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :