contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహిళా సాధికారత పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఆలోచనా విధానం పై సదస్సు

నెల్లూరు జిల్లా: బహుజన మహిళా సాధికారిత ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మహిళా సాధికారతపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం పై సదస్సు జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా సైకాలజిస్ట్ పి . ఆర్ నళిని మాట్లాడుతూ స్త్రీలు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడం ఎలా అందుకు అంబేద్కర్ ఆలోచన విధానం ఎలా ఉపయోగపడుతుంది అని వివరించి చెప్పారు ప్రముఖ   న్యాయవాది షేక్ షాన్‌వాజ్ గారు మహిళా సాధికారతకైడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచిన చట్టాల గురించి వివరించారు విక్రమ సింహపురి యూనివర్సిటీ రెక్టర్ఆచార్య చంద్రయ్య మాట్లాడుతూ మహిళ విద్య గురించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన మహిళా చట్టాలను గురించి విపులముగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలిపారు 

శ్రీమతి డాక్టర్ జి భారతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పటానికి పూలమాలలు సమర్పించి విఆర్సి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఊరేగింపుగా వెళ్లారు ఈ సదస్సులో జ్యోతి JD (rtd) ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏపీ జి మంజుల, జి స్వరూపరాణి ప్రసంగించారు.

బహుజన మహిళ సాధికారత ట్రస్ట్ ఫౌండర్ గౌడ్ రమణయ్య, సారథ్యంలోఈ సదస్సు గనంగా జరిగిందివిక్రమ సింహపురి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థినులు  ఈ సదస్సులో పాల్గొని  వక్తలను పలు విషయాలనుఅడిగి తెలుసుకున్నారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నవలసిన asp శ్రీ లక్ష్మీ గారు, కర్నూల్ గౌతమి సాలి ఐపీఎస్ మరియు టెలీకమ్యూనికేషన్స్ విజయవాడ అధికారులు మేకల సంధ్య సమీరావృత్తి పరమైన బాధ్యతల వల్ల హాజరు కాలేదు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :