contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మార్పు , ఇకపై మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేనట్టే

Microsoft Edge Chromiumలో అనేక ఆసక్తికరమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా దీని యూజర్ ఇంటర్ ఫేస్ మొత్తం సమూలంగా మార్చబడింది. ప్రస్తుతానికి ఇది చూడటానికి పూర్తి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లా ఉంటుంది. అలాగే అనేక మంది వ్యక్తులతో ఒకటే బ్రౌజర్ షేర్ చేసుకోవటానికి వీలుగా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా, కేవలం మైక్రోసాఫ్ట్ స్టోర్లో లభిస్తున్న ఎక్స్టెన్షన్ మాత్రమే కాకుండా, Google Web Storeలోకి వెళ్లి మీకు కావలసిన ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
వీటితోపాటుగా ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్లు కూడా పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తుంది. వివిధ వెబ్ సైట్లలో ఆర్టికల్స్ చదివేటప్పుడు, నిజంగా పుస్తకం చదువుతున్న అనుభూతి కలిగే విధంగా పలురకాల పేజ్ థీమ్‌లతో ప్రత్యేకమైన రీడర్ మోడ్ అందించబడింది. కళ్ళ మీద తక్కువ ఒత్తిడి పడే విధంగా Dark Theme సపోర్ట్ కూడా దీంట్లో అందించబడింది. అలాగే ఒక అంశానికి సంబంధించి రీసెర్చ్ చేసేటప్పుడు, దానికి సంబంధించిన ఇమేజ్లు, టెక్స్టు, వీడియోలు వంటి వాటిని కలెక్షన్స్ రూపంలో సేవ్ చేసుకునే అవకాశం కూడా ఈ Microsoft Edge Chromiumతో మనకు లభిస్తుంది. ఈ లింక్ నుండి ఈ బ్రౌజర్ ఫైనల్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఇప్పటికే మీ windows 10 కంప్యూటర్ లో ఉన్న Edge బ్రౌజర్ రీప్లేస్ చేయబడి ఇది కొత్తగా అందుబాటులోకి వస్తుంది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :