భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటకి రావాలని ఎవరైనా మస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే 1000/- రూపాయలు జరిమానా విధంచనున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ తెలిపారు. ఈ 1000/- జరిమానాను TS E-Challan అప్లికేషన్ ద్వారా విధించాలని జిల్లాలోని పోలీసు అధికారులందరికి ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలియజేసారు.కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా ప్రజలందరూ మాస్కులను ధరించి పోలీసు వారికి సహకరిస్తూ వారి కార్యకలాపాలను చేసుకోవాలని సునీల్ దత్ కోరారు.
