Airtel సంస్థ తాజాగా దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో 179 రూపాయల విలువ కలిగిన కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో పాటు రెండు లక్షల విలువ కలిగిన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అందించబడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా చూస్తే ఇప్పటికే 279 రూపాయల విలువ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఇరవై ఎనిమిది రోజులపాటు వర్తించే నాలుగు లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన 179 రూపాయల ప్లాన్ కూడా 28 రోజులపాటు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ లో ఎలాంటి రోజువారీ డేటా ప్రయోజనాలు లభించవు. Bharathi AXA Life Insurance ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న వినియోగదారులకు అందించబడుతుంది.
179 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజులపాటు వ్యాలిడిటీ కలిగిన 2GB మొబైల్ డేటా తో పాటు, దేశంలోని ఎలాంటి నెట్వర్క్‌కైనా అపరిమితమైన వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. మొబైల్ డేటా తో పెద్దగా పని లేకుండా కేవలం వాయిస్ కాల్స్ మీద మాత్రమే ఆధారపడి పని చేసే వారి కోసం ఈ సరికొత్త ప్లాన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా మరోవైపు ఇరవై ఎనిమిది రోజులపాటు వాడుకోగలిగే విధంగా 300 ఎస్ఎంఎస్లు ఇవ్వబడతాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference