కరుడుగట్టిన మహిళా మావోయిస్టు అరెస్ట్ - 26 మంది కాంగ్రెస్ నేతలను చంపిన రికార్డ్

26 మంది కాంగ్రెస్ నేతలను హత్య చేసిన కరుడుగట్టిన మహిళా మావోయిస్టు సుమిత్రా పూనం అలియాస్ సుమిత్రక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన సుమిత్ర.. మే 25, 2013న  సుక్మాజిల్లా దర్బా లోయలో కాంగ్రెస్ నాయకులపై దాడిచేసిన పుష్పల్ దళ సభ్యురాలు. ఈ దాడిలో  కాంగ్రెస్ నాయకులు మహేంద్రకర్మ, నందకుమార్ పటేల్, మాజీ ఎమ్మెల్యే ఉదయకుమార్ ముదలియార్లతో పాటు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ నాయకులపై దాడిలో మొత్తం 39 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. వారిలో ఇప్పటికే పదిమందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయారు. 27 మంది పరారీలో ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post