ఎస్ఎంసి చైర్మన్ గా బుర్ర సత్యనారాయణ గౌడ్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం ఉన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలలో చైర్మన్ గా అదే గ్రామానికి చెందిన బుర్ర సత్యనారాయణ గౌడ్ ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ గా ఏడు మ్యాకల మంగ ఎన్నికయ్యారు ఉదయం 11 గంటలకు, ముందుగా 6 7 8 తరగతులకు ప్రతి తరగతికి ముగ్గురు చొప్పున ఎస్ఎంసి సభ్యులను ఎన్నుకున్నారు అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది అనంతరం జరిగిన మొదటి ఎస్ఎంసి సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా గ్రామ సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, వైస్ ఎంపీపీ న్యాత సుధాకర్, ఎంపీటీసీ బొడ్డు సునీల్, వార్డ్ మెంబర్ బుర్ర జనార్ధన్ లు హాజరై నూతనంగా ఎన్నికైన యాజమాన్య కమిటీ ని అభినందించారు పాఠశాలను అన్ని రంగాలలో ముందుంచాలని అన్నారు పాఠశాల అభివృద్ధికి సమయం కేటాయించాలని కోరారు ఈ సందర్భంగా బుర్ర సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేస్తానన్నారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందు ఉంటానని పేర్కొన్నారు పాఠశాల ఉపాధ్యాయ బృందం 6 7 8 తరగతి విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post