జగన్ అవినీతి గురించి ప్రపంచ దేశాల్లో కేస్ స్టడీలుగా చెబుతున్నారు :నారా లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ గారి అవినీతిపై ప్రపంచంలోని ఉత్తమ సంస్థలు, యూనివర్శిటీలు అధ్యయనం చేసి, జగన్ అవినీతి కీర్తి గురించి ప్రపంచ దేశాల్లో కేస్ స్టడీలుగా చెబుతున్నాయని… ఈ నేపథ్యంలో, ఏపీలో జరుగుతున్న అవినీతిపై అధ్యయనం చేయిస్తానని జగన్ చెప్పడం కామెడీ కాకపోతే మరేమిటని ఎద్దేవా చేశారు. అవినీతికి అమ్మా, నాన్న కూడా తానే అయిన జగన్ అవినీతిని నిర్మూలిస్తానని స్టేట్ మెంట్ ఇవ్వడం కన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. జగన్ కామెడీ అదిరిపోయిందని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

జగన్ గారు అంతా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారని… పబ్లిసిటీ పీక్స్ కు వెళ్లిందని లోకేశ్ చెప్పారు. కానీ, చిన్న తప్పు చేసి దొరికిపోయారని అన్నారు. ‘మా నాన్న నిజాయతీపరుడు, మరి మీ నాన్న?’ అనే ప్లకార్డును పక్కనున్న అధికారితో పట్టించిన జగన్… తాను పట్టుకునే ధైర్యాన్ని మాత్రం చేయలేకపోయారని సెటైర్ వేశారు. దీంతోపాటు, జగన్ ప్లకార్డులు పట్టుకున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post