గుంటూరులో వ్యభిచార దుకాణం గుట్టురట్టు - నిర్వాహకులు సహా ఆరుగురి అరెస్ట్

కాలేజీ పక్కనే దుకాణం తెరిచిన వ్యభిచార ముఠా గుట్టును గుంటూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు. చినకాకాని ప్రాంతంలో ప్రైవేటు కళాశాలల హాస్టళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం విద్యార్థులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఓ వ్యభిచార ముఠా ఇక్కడ దందా ప్రారంభించింది. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు విటులు, నలుగురు నిర్వాహకులు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post