గాంధీని చంపిన గాడ్సే ముమ్మాటికీ దేశ భక్తుడే : బిజెపి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్

వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎస్పీజీ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే నేత ఎ.రాజా మాట్లాడుతూ.. మహాత్మాగాంధీపై గాడ్సే కక్ష పెంచుకుని చంపినట్టు పేర్కొన్నారు. దీనికి ప్రజ్ఞా ఠాకూర్ బదులిస్తూ.. దేశభక్తులను ఉదాహరణలుగా వాడొద్దంటూ పరోక్షంగా గాడ్సే దేశభక్తుడని కీర్తించారు. అలాగే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు.1984లో భోపాల్‌ దుర్ఘటనకు కారణమైన కార్బైడ్ సంస్థ చైర్మన్ అండర్సన్‌ను ఉగ్రవాదిగా పోల్చారు. దేశంలోని వేలాదిమంది ప్రాణాలు తీసిన విదేశీయుడిని దేశం విడిచి వెళ్లేలా చేసింది కాంగ్రెస్సేనని ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post