ఇచ్చినమాట కు కట్టుబడిన జగన్ - మత్స్యకారులకు శుభవార్త

తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జగన్.. పశువుల్లంక-సలాదివారిపాలెం వంతెనను ప్రారంభించారు. అలాగే, కొమానపల్లిలో టూరిజం కంట్రోల్ గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

‘974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా ఇక్కడి మత్య్సకారులు అప్పట్లో బతుకుదెరువు కోసం వలసలు వెళ్లారు. గంగ పుత్రుల జీవితాలు మార్చే నిర్ణయాలు తీసుకున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఓ ప్రకటన చేయడానికి ఇక్కడకు వచ్చాను. ఆదాయం కోల్పోయిన ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి తోడుగా ఉంటానని పాదయాత్రలో చెప్పాను’ అని  సీఎం జగన్ అన్నారు.

‘అప్పట్లో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబానికి ముష్టి వేసినట్లు రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు. గతంలో మాటలు చెప్పేవారు అరకొర మాత్రమే సాయం చేసేవారు. అది కూడా కొంతమందికే ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు తీర్చాలని నిర్ణయం తీసుకున్నాం. వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు ఇస్తాం’ అని జగన్ ప్రకటించారు.

‘ప్రజల సమస్యలను తీర్చడం కోసమేం ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నా. మత్స్యకారులకు డీజిల్ పై రాయితీ రూ.9కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.  పిల్లల జీవితాలు మార్చేందుకు నాడు-నేడు కార్యక్రమం చేస్తున్నాం. ఇంగ్లిషు మీడియం ఆలోచనను విమర్శిస్తోన్న వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? రాబోయే రోజుల్లో గొప్ప మార్పులు చేయబోతున్నాం’ అని జగన్ వ్యాఖ్యానించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post