అభివృద్ధి తోనే ప్రజల్లో నాయకులకు అభివృద్ధి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ,గ్రామపంచాయతీ ట్రాక్టర్లను పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ముత్తన్న పేట, గాగిల్లాపూర్, గుగ్గిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక లో భాగంగా గ్రామాల అభివృద్ధి జరగాలి గ్రామాల అభివృద్ధి జరిగితే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు అని గ్రామంలో ఉన్న చెత్తాచెదారాన్ని డంపింగ్ యార్డ్ తరలించడానికి, సేకరించడానికి కేసిఆర్ గారు ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే 23 మందికి 25 లక్షలకు పైగా కల్యాణ లక్ష్మీ చెక్కులను, పిడుగు పాటు కు మరణించిన పశువులకు మరియు వర్షాల కారణంగా గోడ కూలి చనిపోయిన గొర్రెలకు గాను నష్టపరిహారం కింద 65వేల రూపాయలు అందించడం జరిగిందని. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసి వారి అభివృద్ధి కి తోడ్పడే నాయకుడే మున్ముందు ప్రజల గుండెల్లో ఉంటాడని పేర్కొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post