కొడాలి నాని పై కేసు నమోదు చేయాలనీ తిరుపతి పోలీసులకు బిజెపి ఫిర్యాదు

ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నేతలు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ, ‘తిరుమల ఆలయాన్ని మీ అమ్మ మొగుడు కట్టాడా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారంటూ మండిపడ్డారు.  మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కొడాలి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  నానిపై కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళతామని తెలిపారు .

0/Post a Comment/Comments

Previous Post Next Post