వరంగల్ యువతి హత్యకేసును గంటల్లో ఛేదించిన పోలీసులు

వరంగల్ లో ఓ యువతి పుట్టినరోజు నాడే శవమై తేలిన ఘటనలో పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నారు. వరంగల్ కు చెందిన యువతి జన్మదినం సందర్భంగా భద్రకాళి ఆలయానికి వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు. గతరాత్రి స్థానిక విష్ణుప్రియ గార్డెన్ సమీపంలో యువతి శవమై కనిపించింది. దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టిన పోలీసులు నిందితుడ్ని నెమలిగుండ్లకు చెందని సాయికుమార్ గా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారణ షురూ చేశారు.
డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సాయికుమార్ కు యువతితో కొన్ని నెలల కిందటే పరిచయం అయింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి కాజీపేటకు రావాలని సూచించాడు. అక్కడికి కారులో చేరుకున్న సాయికుమార్ ఆ యువతిని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఎక్కడైనా పడవేసేందుకు ఫ్రెండ్స్ ను సాయం కోరగా, వారు హడలిపోయారు.దాంతో కారులోనే మృతదేహాన్ని ఉంచుకుని వరంగల్ నగరంలోకి వచ్చి ఓ షాపులో కొత్త దుస్తులు కొని ఆ అమ్మాయి మృతదేహానికి వేశాడు. రాత్రి మృతదేహాన్ని విష్ణుప్రియ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post