కులానికి సంకెళ్లు పడ్డాయనేదే వారి బాధంతా అంటూ ఎద్దేవా చేసిన ఎపి మంత్రి కోడలి నాని

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జీవో 2430’పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన మంత్రి పేర్ని నాని నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై దుర్మార్గపు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మీడియా యాజమాన్యాలు ఇప్పటికైనా తాము న్యాయవ్యవస్థ కంటే గొప్పవాళ్లమన్న భావన మానుకోవాలని సూచించారు. జీవో 2430పై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

అదే సమావేశంలో మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో కలానికి సంకెళ్లు పడ్డాయని అందరూ గగ్గోలు పెడుతున్నారని, నిజానికి వారి బాధంతా కులానికి సంకెళ్లు పడ్డాయనేదేనని అన్నారు. బెడ్‌ రూముల్లో జరిగే విషయాలపై పిచ్చి రాతలు రాస్తామంటే ఇక కుదరదని హెచ్చరించారు.

https://www.youtube.com/watch?v=bpqbTkugeWg

0/Post a Comment/Comments

Previous Post Next Post