పలు అభివృద్ధి కార్యకమాల సమావేశం - పాల్గొన్న ఎంపీపీ జడ్పిటిసి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలోని శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపిపి లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి లు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో నర్సరీలు డంపింగ్ యార్డులు మరియు వైకుంఠదామాలను ఏర్పరుచుకోవాలని సూచించారు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నర్సరీలు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని వాటి నిర్వహణ మంచిగా ఉందని తెలిపారు శ్మశానవాటికల విషయంలో ఇప్పటికే స్థల సేకరణ శంకుస్థాపనలు జరిగాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అభిప్రాయపడ్డారు ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా తమ వంతు కృషి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, ఎంపిడిఓ సురేందర్ రెడ్డి,మండల కో ఆఫ్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ ఎంపిఓ మరియు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యదర్శులు ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post