కలుషితమైన నీరు - ప్రజల ప్రాణాలతో చెలగాటం

అనంతపురం : బుక్కరాయసముద్రం మండలంలోని వివిధ గ్రామాలలో త్రాగునీరు కలుషితమై డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాల బారిన పడి తీవ్ర అనారోగ్యాల తో బాధ పడుతున్న కారణంగా అధికారులు వెంటనే స్పందించి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామాలలో పరిశుభ్రమైన మంచినీరు అందించాలని ప్రతి గ్రామంలోనూ ఫాగింగ్ చేయించి నిలిచి ఉన్న నీటిలో బ్లీచింగ్ చేయించాలని దోమల నివారణ చేసి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి గ్రామంలోనూ మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మండల సమితి ఆధ్వర్యంలో “ధర్నా” నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కె వై ప్రసాద్ సహాయ కార్యదర్శి హరి మండల కార్యవర్గ సభ్యులు కె బండల రామాంజనేయులు, శుభహాన్, వెంకటరాముడు, తిరుపతయ్య యువజన సమాఖ్య నాయకులు ఆనంద్, భాష, నరసింహులు, సలీం మహిళా సమాఖ్య నాయకులు రాఘవేంద్ర కాలనీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post