సంజీవని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం: సంజీవని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నిర్వహించిన 27వ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం మండలంలోని మహాత్మ నగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరానికి ముఖ్య అతిథిగా కెడిసిసిబి డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సర్పంచ్ జక్కని శ్రీ వాణి లు హాజరై మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో గ్రామీణ ప్రాంతాలలో సంజీవని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని మారుమూల ప్రాంతాలలో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు. అనంతరం ఆసుపత్రి ఆధ్వర్యం లో ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు విజయ లక్ష్మి,నవీన్ కుమార్,ఎంపీడీవో రవీందర్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు,నాయకులు నాయిని వెంకటరెడ్డి, జక్కని రవీందర్, వార్డ్ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post