సూడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం...23 మంది దుర్మరణం

ఆఫ్రికా దేశం సూడాన్ లోని ఓ కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని ఖార్తూమ్, పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ప్రమాదం చోటుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కర్మాగారంలో దాదాపు 50 మంది భారతీయులు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ, మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని వెల్లడించింది.

ప్రమాదం జరిగిన కర్మాగారంలో అగ్ని ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు లేకపోవడంతో… ప్రాణ నష్టం భారీగా పెరిగింది. అలాగే మంటలను మరింత పెంచే వస్తువులను జాగ్రత్తగా నిల్వ చేయకపోడం వల్ల కూడా ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post