ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేంటి? పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ వైసీపీ జెండా రంగులతో నింపేస్తున్న ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ  రంగులు ఏమిటని కోర్టు నిలదీసింది. అసలు ఏ ప్రాతిపదికన రంగులు వేశారో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ గుంటూరు కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ జెండా రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన న్యాయ స్థానం ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు ఎలా వేస్తున్నారని ప్రశ్నించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post