వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న అత్యాచార బాధిత బాలిక బంధువులు, ప్రజా సంఘాలు

గుంటూరులోని రామిరెడ్డి నగర్ లో ఓ బాలికపై ఓ కుర్రాడు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు బాధితురాలిని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే,  ఆసుపత్రి  ఎదుట జనసేన, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. వాసిరెడ్డి పద్మ ఆసుపత్రి నుంచి బయటకు రాగానే ఆమెను బాధిత బాలిక బంధువులు, రాజకీయ, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బాలికకు వెంటనే న్యాయం చేయాలని, దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post