భారత నేవీలో తొలి మహిళా పైలెట్!

ఇటీవల భారత సాయుధ దళాల్లో మహిళలను కూడా అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. పురుషులకు తామేమీ తీసిపోమని అతివలు అనేక రంగాల్లో నిరూపిస్తున్న ఈ కాలంలో అమ్మాయిలు ఆయుధాలు చేతబట్టడంలో ఎవరికీ ఆశ్చర్యం కలగడంలేదు. తాజాగా, బీహార్ కు చెందిన శివాంగి భారత నేవీలో తొలి మహిళా పైలెట్ గా ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాదే ఇండియన్ నేవీలో అడుగుపెట్టిన ఆమె తొలుత మెడికల్ విభాగంలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న శివాంగికి తాజాగా డోర్నియర్ నిఘా విమానం పైలెట్ గా బాధ్యతలు అప్పగించారు. కొచ్చిలోని నేవల్ బేస్ అధికారులు శివాంగికి స్వాగతం పలికారు. భారత ప్రాదేశిక సముద్ర జలాలపై శివాంగి విమానంలో ప్రయాణిస్తూ నిఘా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సముద్రంలో అనుమానాస్పద నౌకలు కనిపిస్తే బలగాలకు సమాచారం అందించాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post