చటాన్ పల్లి ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టులో మరో పిటిషన్

చటాన్ పల్లి వద్ద దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్ శర్మ రిట్ పిటిషన్ వేశారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని శర్మ తన పిటిషన్ లో ఆరోపించారు. అంతేకాకుండా, ఎంపీ జయాబచ్చన్, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఇద్దరూ ఎన్ కౌంటర్ ను సమర్థిస్తూ మాట్లాడారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మీడియా కథనాలు ప్రసారం చేయకుండా ఆంక్షలు విధించాలని కోరారు. ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని శర్మ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ, కొద్దిగా ఆలస్యమైనా సరైన పనే చేశారని జయాబచ్చన్ వ్యాఖ్యానించగా, నిందితులు పోరిపోతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా? అంటూ స్వాతి మలివాల్ స్పందించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post