కాంగ్రెస్ ర్యాలీ కి అనుమతి ఇవ్వం : డిజిపి మహేందర్ రెడ్డి

జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నెల 28న హైదరాబాద్ లో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కలిశారు. సభ నిర్వహించుకోవడానికైతే అనుమతిస్తాం కానీ ర్యాలీకి మాత్రం ఇవ్వమని డీజీపీ స్పష్టం చేసినట్టు సమాచారం.

రోడ్లపై నిరసనల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది: సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ లో రోడ్లపై ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని అన్నారు. హైదరాబాద్ లో ఏ రాజకీయ పార్టీ అయినా సమావేశాలు నిర్వహించుకోవచ్చు కానీ, ఆయా పార్టీల కార్యాలయాల్లో మాత్రమే నిర్వహించుకోవాలని చెప్పారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post