మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు గ్రామాలలో మంజూరైన కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లోని చెరువులు అన్నీ నీటితో నిండి ఉన్నాయని రైతులు వాడి సాగు కాకుండా కూరగాయలు, మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలను సాగు చేసేలా ప్రజా ప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెల 2 నుండి జరిగే పల్లె ప్రగతి లో ఉత్సాహంగా పాల్గొనలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, ఎమ్మార్వో కె రమేష్, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post